మహోన్నత మానవతావాది బాలగోపాల్ – మనోరంజన్ మహంతి వ్యాసం
పౌర హక్కుల ఉద్యమాల మూలంగా గత మూడు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో గొప్ప సృజనాత్మక పరివర్తనలు సంభవించాయి. ఈ పరిణామాలకు బాలగోపాల్ చేసిన దోహదం చాలా విశిష్టమైనది. ఆయన నిశిత మేధాశక్తి, నిష్పాక్షిక, నిస్వార్థ నాయకత్వం నుంచి విశాల భారతదేశపు పౌర, మానవహక్కుల ఉద్యమాలు ఇతోధికంగా లబ్ధి పొందాయి.
బాలగోపాల్ ఇక లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నా ను. ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య శాంతి చర్చల కు చొరవ తీసుకొనేందుకు నిర్వహించిన ఒక సమావేశంలో ప్రసంగించేందుకు గత నెలలోనే ఆయన ఢిల్లీ వచ్చారు. ఆయన మరణంతో భారతదేశంలోని ప్రజాస్వామ్య హక్కుల కార్యకర్తలు ఒక గొప్ప మార్గదర్శిని కోల్పోయారు. భారతదేశపు ప్రగతిశీల ప్రజాస్వామ్య ఆలోచనా స్రవంతిని సమున్న తం చేసిన ఒక అరుదైన మేధావిని భారతీయులు కోల్పోయారు.
మానవ హక్కుల ఉద్యమంలో పనిచేస్తోన్న నా లాంటి ఎంతో మందికి బాలగోపాల్ ఒక స్ఫూర్తిదాయక మార్గదర్శి. కణ్ణబీరన్, హరగోపాల్‌లతో కలిసి ఆయ న ఉదారవాదుల, మార్క్సిస్టుల ప్రధాన స్రవంతి భావాలను సవాల్ చేస్తూ మానవ హక్కుల అర్థాన్ని నిర్వచించారు. పౌర స్వేచ్ఛ అంటే అన్నిటికీ మించి చట్టబద్ధమైన పాలన కనుక భద్రతా దళాలు చేసే బూటకపు ఎన్‌కౌంటర్లను చట్ట విరుద్ధమైనవిగా పరిగణించాలని బాలగోపాల్ డిమాండ్ చేశారు. దేశంలో ని అన్ని రాష్ట్రాలలో ఉన్న హక్కుల సంఘాలు ఈ అంశానికి ఇచ్చిన ప్రాధాన్యం వల్లే నేడు బూటకపు ఎన్‌కౌంటర్‌లకు వ్యతిరేకం గా ప్రజాభిప్రాయం పటిష్టమయింది.
ఇప్పటికీ ఆ బూటకపు ఎన్‌కౌంటర్లు ఆగిపోలేదు. అయితే భద్రతా దళాలు గతంలో మాదిరిగా నిర్భయంగా వాటికి పాల్పడడం లేదు. పాల్పడితే ప్రజలు నిలదీస్తారనే భయం వారిని వెంటాడుతోంది. బూటకపు ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని ప్రోదిచేయడానికి, పౌర హక్కులను పటిష్టం చేయడానికి బాలగోపాల్ చేసిన కృషిని దేశ ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు.
ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘంలో పనిచేస్తున్నప్పుడు గానీ, మానవ హక్కుల వేదికలో పనిచేస్తున్నప్పుడు గానీ, బాలగోపాల్ పౌర హక్కులను ఒక సంకుచితార్థంలో పరిగణనలోకి తీసుకోలేదు. రాజకీయ, సామాజిక, సాంస్క ృతిక, ఆర్థిక స్వాతంత్య్రాలకు సామాన్య మానవులకు గల హక్కులే పౌర హక్కులు అని ఆయన నిండుగా విశ్వసించారు.
పౌర హక్కుల ఉద్యమంలో భాగంగా నే దళితులు, మహిళలు, మైనారిటీలపై జరిగిన దాడులు, అత్యాచారాలకు వ్యతిరేకంగా ఎన్నో కేసులలో ఆయన వాదించారు. పౌర హక్కుల ఉద్యమాల మూలంగా గత మూడు దశాబ్దాలలో ఆంధ్రప్రదేశ్ సమాజంలో గొప్ప సృజనాత్మక పరివర్తనలు సంభవించాయి. ఈ పరిణామాలకు బాలగోపాల్ చేసిన దోహదం చాలా విశిష్టమైనది.
ఆయన నిశిత మేధాశక్తి, నిష్పాక్షిక, నిస్వా ర్థ నాయకత్వం నుంచి విశాల భారతదేశపు పౌర, మానవహక్కుల ఉద్యమాలు ఇతోధికంగా లబ్ధి పొందాయి. బాలగోపాల్ గురించిన ఎన్నో జ్ఞాపకాలు నన్ను ఇప్పుడు ముప్పిరి గొంటున్నాయి. ఒక అనుభవాన్ని వివరిస్తాను. 1985లో ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ఒక స్మారక సభలో పాల్గొనడనాకి వెళ్ళిన బృందంలో నేనూ ఒక సభ్యుడిని (బాలగోపాల్ అప్పు డు ఎపిసిఎల్‌సి ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు). పోలీసులు మా వాహనాన్ని ఆపి మమ్ములను అరెస్ట్ చేశారు. మిగతా వ్యాసం ఇక్కడ చదవండి