CAPTCHA Image CAPTCHA Audio
Refresh Image

Blog

District 9 (2009) రివ్యూ

district9పీటెర్ జాక్సొన్(Lord of Rings fame) ప్రొడ్యూస్ చేసిన,నీల్ బ్లొకెంప్ మొట్ట మొదటిసారిగా డైరెక్ట్ చేసిన District 9 సినిమా ఒక socio-political message తొ కూడుకున్న కథాంశం. కథ లోకి వెళ్తే ఒక స్టార్ షిప్ దక్షిణాఫ్రికా లోని జొహన్స్ బర్గ్ కి రావడం ద్వారా ప్రారంభం అవుతుంది. ఆ స్టార్ షిప్ లో ప్రాన్స్ అనబడే ఏలిఎన్స్ చాలా బలహీన పరిస్థితుల్లొ వుండడం మూలాన దక్షిణాఫ్రికా గవర్నమెంటు ఏలిఎన్స్ కి ఒక షెల్టెర్ ప్రాంతం నిర్మిస్తుంది. ఆదే ‘District-9’. క్రమక్రమంగా ఏలిఎన్స్ బలహీనతలని సొమ్ము చేసుకుంటూ ఆప్రాంతం ఒక అసాంఘిక శక్తుల అడ్డాగా రూపాంతరం చెందుతుంది. మెల్లిమెల్లిగా అక్కడ నివసించే ప్రజలు ఇది భరించలెకపొవడంతో అక్కడి గవర్నమెంటు ఏలిఎన్స్ కాలనీని అక్కడినుండి సుదూర ప్రాంతానికి తరలించే ఏర్పాట్లని మన కథా హిరొ(Protagonist)కి అప్పగిస్తుంది. అప్పటి వరకు ఒక Documentary లా నడుస్తున్న చిత్రం ఒక్కసారిగా మనలని ఒక action సినిమా ప్రపంచం లోకి నెట్టెస్తుంది. ఈ క్రమం లో హెరొ ఒక ఏలిఎన్ chemical matter మూలంగా విచిత్రమైన శారీరక మార్పులకు గురి అవుతాడు. ఇది తెలుసుకున్న అతను పనిచేసే కంపనీ, హీరొ ని ప్రాణాపాయ పరిస్తితుల్లొంచి బయటకి పడేయడం సంగతి అటుంచి ,అతని శరీరాన్ని ఏలిఎన్స్ ఉపయించే అయుధాలని ఎలా వాడాలి అన్న పరిజ్ఞానము Develop చేయడనికి వుపయొగిస్తారు. హీరొ మామ(మన ద్రుష్టిలొ విల్లన్) దీనికి అధికారి గా వుంటాడు. ఇది అర్థమైన హిరొ, ప్రయోగశాల నుంచి పారిపొయి ఏలిఎన్స్ వద్దకు వెల్లి దీని విరుగుడు కి సాయం కోరతాడు. అక్కడి నుంచి కథ ఆసక్తికరంగా మలుపు తిరుగుతుంది. ఏలిఎన్స్(తండ్రి బిడ్డలు) హిరొ కి సాయం చెయడం, దానికి ప్రతి ఫలం గా హిరొ ఏలిఎన్స్ మరలా తమ విశ్వంలోకి ఎగిరిపొవడానికి ఉపయొగించే పరికరం తెచ్చి ఇవ్వడంలో సాయపడతాడు. ఈ కథలో వీరితొ పాటు ఏలియన్ అయుధాలని అమ్మె ఒక చిల్లర గాంగ్ నాయకుడు హిరో కి సంక్రమించిన శక్తిని తాను గ్రహించాలని మరో కొణం నుంచి attack చేస్తాడు. ఈ విధంగా హిరొ-ఏలీన్ తండ్రి-ఏలీన్ పిల్లాడు ఒక వైపు, ప్రభుత్వ సైన్యం ఓ వైపు, చిల్లర గాంగ్ ఇంకోపక్క ఇలా పొరాటం మొదలవుతుంది. చివరకు హిరొ చేసె సాయం మూలంగా ఏలీన్స్ తమ mother ship  వైపుకు బయలుదెరుటం తో కథ సుఖాంథం అవుతుంది. ఇంతకి మన హిరొ ఎమవుతాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవలసిందే!

ఈ కథ ద్వారా దర్శకుడు మానవ సంబంధాలని,విలువలని ఒక కొత్త కోణంలో ఆవిష్కరిచాడు. మామూలు Sci-Fi సినిమాల్లొ కనిపించే మనిషికన్నా బలమైన ఏలియన్స్ కాకుండా,మనిషి సాయం కోసం పరితపించే సెంటిమెంటల్ ఏలియన్స్ ని ఈ సినిమా లో చూస్తాం. Director కొత్త వాడైనా, brilliant screenplay తో సినిమా ఆసాంతం రక్తికట్టించాడు. సినిమా setup మరియు conclusion  చాలా ఇంట్రెస్తింగ్ గా తీసాడని చెప్పొచు. చూసే ప్రెక్షకుడికి ఇది రియల్ లైఫ్ లో జరుగుతున్న ఒక కథ అని కన్విన్సింగా వుండడం కొరకు  T.V లో చూస్తున్న ఒక బ్రేకింగ్  news లా సినిమా స్టార్ట్ అవుతుంది. సినిమా దాదాపు పాతిక భాగం ఈవిధంగా నడిచి ఆతర్వత ఒక action మూడ్ లొకి వెలుతుంది. మొదట్లొ విచిత్రంగా, క్రూరంగా అనిపించే ఏలియన్స్ పై రాను రాను చూసే ప్రెక్షకుడికి సానుభూతి కలుగుతుంది అంటే అతిశయొక్తికాదు. వాటిపై జాలితొ  హిరొతో పాటు మనం కూడా ఆ ఏలియన్స్ ని రక్షించి, వాటిని ఎలా వారి విశ్వం వైపు చేర్చాలి అని అనుకుంటాము. ఇకడే దర్షకుది treatment తీరు,  CGI పనితీరు మనలను చాల ఆకట్టుకుంటాయి. ఈ సమ్మర్ లో వచ్చిన ఒకానొక హిట్ ఫిల్మ్ అని నిస్సందేహంగా చెప్పవచు. production  కాస్ట్ లొ దాదాపు 50 శాతాన్ని release అయిన మొదటి రొజు boxoffice వద్ద సంపాదించి పెట్టింది. ఏ విధమైన starcast లెకుండా , ముక్కుమొహం తెలిని కొత్త director తీసిన సినిమా కి ఇటువంటి collections రావడం బహూరుదుగా జరుగుతుది. $30మిలియన్ టొటల్ బడ్జెట్ తో release ఐ ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా దాదపు $200 మిలియనులు  వసూలుచేసింది.

సినిమా runtime  : 112 minutes

హిరొ : Sharlto Copley as Wikus van der Merwe

దర్షకుడు:30yr old Neil Blokemp

నిర్మాత: Peter Jackson ,Lord of Rings fame

———————————————————————-

About admin

ముఖచిత్రం బాగోగులు చూసే అడ్మిన్ బ్యాచిలర్స్ చదువుకునేరోజుల్లొ ఒక 1000W ఆంప్లిఫైర్ బిల్టిన్ నాయిస్ కాన్సిలేషన్ (Dolby లాంటిది అన్నమాట) తయారుచేశాడు.మార్కెట్ లో ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆంప్లిఫైర్ దొరుకుతుంది మరీ...? అదేనండి కిక్క్ అంటే!

2 responses to “District 9 (2009) రివ్యూ”

  1. suresh says:

    సినిమా బాగుంది. రివ్యు మరీ బావుంది!

  2. admin says:

    మీ సమీక్షకి ధన్యవాదాలు! సినిమా తప్పక ఒక్కసారైనా చూడొచ్చు!

Leave a Reply