CAPTCHA Image CAPTCHA Audio
Refresh Image

Blog

కన్నీటి వీడ్కోలు

ysrఓ దుర్దినం!
తన చిరునవ్వుతో ప్రజల బ్రతుకుల్లో వెలుగు నింపే కారణజన్ముడు
భూమ్మీద వున్నాడన్న కసితో దినకరునికి కోపం వచ్చిన వేళ అది!
ఓ అపరభగీరధుడు జలయగ్నం చేస్తున్నాడన్న అక్కసుతో!
ఆంధ్రరాష్త్ర పెరట్లో తనని భందీ చేస్తాడన్న భయంతో!
వరునదేవుడు ఆవేశపడి కాగుతున్న వేళయది!
అందరికన్నా మొండిదైన కాలం..
తనకెవ్వరూ అడ్డులేదన్నట్టు పరిగెడుతుంది!
దానికి తెలియదు ..రాజన్న జగమొండియని..
లెక్క చేయక రచ్చబండ కై రయ్యిమని నింగికెగశాడు!
అంతలో.. కారుమబ్బులు కమ్ముకున్నాయి
ప్రకౄతి కన్నెర్ర చేసింది..పంచభూతాలు పన్నాగం పన్నాయి!
కటిక చీకట్లో ..కారడవిలో..
అందరూ ఏకమై ప్రజామనిషిని బలిగొన్నాయి
ఆ ఆత్మని కొండొనిపొయె యమపాసం బరువెక్కింది!
మా నాయకుని కొనిపోవద్దంటూ ఎన్నొ హ్రుదయాలు వేడుకున్నాయి!
మరెన్నో వందల ప్రాణాలు మేము నీవెంటే పదమన్నాయి!
రాజన్నా! మీకు జోహార్!
మరలకలుద్దాం!
ఇచ్చినమాటకు కట్టుబడే రాజ్యంలో!
నమ్మినవారికి మేలుచేసే లోకంలో!

About admin

ముఖచిత్రం బాగోగులు చూసే అడ్మిన్ బ్యాచిలర్స్ చదువుకునేరోజుల్లొ ఒక 1000W ఆంప్లిఫైర్ బిల్టిన్ నాయిస్ కాన్సిలేషన్ (Dolby లాంటిది అన్నమాట) తయారుచేశాడు.మార్కెట్ లో ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఆంప్లిఫైర్ దొరుకుతుంది మరీ...? అదేనండి కిక్క్ అంటే!

Leave a Reply