వుండబట్ట లేక రాస్తున్నా.విసుగ్గావుంటే చదవడం మానేయండి!
మరణించిన వారిగురించి చెడుగా చెప్పడం మన సంస్కృతి కాదంటారు. కాని మారుతున్న కాలానికి అనుగుణంగా మన ప్రవర్తన మారాలి. మన రాష్త్రం లో గత మూడు నెలలుగా జరుగుతున్న power chair పితలాటకం చూస్థుంటే ఏమో చేయాలి కాని ఏది చేయాలో అర్థమవక ఈ బ్లాగ్లో అంతర్మధం చేస్థున్న. ఈ రాజశేఖరుడు చచ్చి ఎక్కడున్నాడో కాని, నెత్తిన రూపాయ పెట్టినా పావలా కి అమ్ముడుపోని దద్దమ్మ మంత్రులని,ఏనాడూ ఒక మంచి సలహా ఇవ్వని ప్రభుత్వ
సలహాదారుడిని, దేభ్యం మొహం వేసుకుని వుండే ప్రభుత్వ ప్రదాన కార్యదర్సిని మనకు అంటే ప్రజలకి అంటకట్టిపొయాడు. ఒకపక్క వరదలతో ప్రజలు సతమతమవుటుంటే మరోపక్క మాకు జగనే కావలంటు పిప్పరమింటు కోసం ఏడిచె పిల్లాడిలా మంత్రులు మారాంచేస్తున్నారు. ఇంకో పక్క ముసలాయన వీరిని సముదాయించాలిసింది పోయి సంతకాలు సేకరిస్తే నేను ఓమారు గెలుకుతానంతూ తయారయ్యాడు. ప్రజలు చేసుకున్న అధ్రుష్టమో ఏమొ కాని వరదల్లో ఇల్లు గుల్లైనా కాని, కనీసం బ్రతికి బట్టకట్టారు. ఈ లోపు వరదలు వాటంతట అవే ఆగిపోయాయి, ప్రజలకు పెట్టిన ఇబ్బంది ఇహచాలని! ఇప్పుడైనా మర్యాదగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని కొంచెం లంచం కొంచెం సేవ అంటారా అంటే అదీ లేదు! ఈలోపు కొండమ్మ రాజీనామ! జగన్మోహనుడిని ముఖ్యమంత్రిగా చేస్తే గాని ఈవిడకి ముద్ద దిగదట! రాష్ట్ర ప్రజలందరూ అదే కోరుకుంటున్నారని అవాకులు చెవాకులు పేలుతుంది. అసలు ప్రజలేం కోరుకుంటున్నారో వీరికి ఎలా తెలుసు? ప్రజలకి అంత భాగ్యమే వుంటే స్వతంత్రం వచ్చి 60 ఏళ్ళు అయినా ఇంకా 2.Rs కిలో బియ్యం కోసం, ఫ్రీ కరెంట్ కోసం ఎదురుచూసే ఖర్మ పట్టేదా?
ఈనాడు మొదటిపేజీ ని పాతిక సంవత్సరాలనుండి చదువుతున్నా(కాకుంటే అప్పుడు పేపర్, ఇప్పుడు వెబ్ లో). హ్మ్..ఏమి మారలేదు. అదే పవర్ కట్లు, దోమ కాట్లు, మురిక్కాలువలు ప్రజలకు స్థిరాస్తి గా నాయకులు పంచిపెట్టారు. వారు మాత్రం రాజకీయాలనే వ్యాపారవృత్తిగా,ప్రవృత్తిగా మార్చుకొని బ్రతికేస్తున్నారు. అడిగే అధికారం లేని ప్రజాస్వామ్యమనే తుప్పుపట్టిన ఆయుధాన్ని ప్రజలకిచ్చారు. ఈ ఆయుధం ఏ ఐదేళ్ళకో ఒక సారి పనిచేస్తుంది. అది కూడా ఏ ఎధవో ఇచ్చే ఐదువందల నోటుకు అమ్ముడుపోతుంది! ఎంత ఆలోచించినా ఒక్కవిషయం బోధపడ్లేదు! ఓటు హక్కు లేనివారికి, బహిష్కరించినవారికి, వినియోగించనివారికి(వాటికి కారణలు మరోసారి) ఈ దేశం లో బ్రతికే అధికారం లేదా? లేదనుకుంటే ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు కాబట్టి, వుంది అనుకుందాం! వారితో కలిపుకుంటే ఈ ప్రభుత్వామన్నా, పాలకులన్నా ఇష్టం లేని వారు దాదాపు డెబ్బై శాతం వరకు వుంటారు. మరి దేశ జనాభా లో ముప్పాతిక మందికి అయిష్టమైన ఈ ప్రభుత్వాలెందుకు? సంకనాకనా (సారీ! ఈ మధ్య పూరి గారి సినిమాలు ఎక్కువ చూస్తున్నాలెండి!)
గురువుగారు,
మీరే ఉద్దేశంతో వ్రాసారో మీ రంగేదో ,కులం గోత్రం ఏదో నాకు అనవసరం. మీరు సతుద్దేశంతోనే ,సత్యాగ్రహంతోనే ఈ ముక్కలు వ్రసారని భావించి ఈ కమెంట్ వ్రాస్తున్నా. చాలా భాగా వ్రాసారు. ఇవేవి జరుగకుండా ఉంటే ఎంతో మంచిది. కాని జగన్ ఇంతగా ఒదిగినప్పటికి ఇన్ని జరుగుతుంటే ఆయన తిరుగుబాటు చేసుంటే ఇంకెంతగా పరిపాలన స్థంభించేదో ఒక్కసారి ఊహించుకుని జగన్ బాబుకు ఒక త్యాంక్స్ చెప్పి ఉండాల్సింది. మంత్రుల గురించిన మీ సెటైర్ భావుంది. కాని సున్నలే అయినప్పటికి అంకెతో కలిసినప్పుడు వేల్యూవచ్చినట్టుగా వై.ఎస్. నేతౄత్వంలో ఇంతటి ఫెయిలియర్ ఎదురుగాలేదుగా ?